raviteja combination,tollywood,news4,news4us

టాలీవుడ్ లో ఊహించని క్రేజీ కాంబినేషన్

న్యూస్ 4 అజ్:టాలీవుడ్ :టాలీవుడ్ లో అప్పుడప్పుడూ స్టార్ హీరో, డైరెక్టర్ ల క్రేజీ కాంబినేషన్ లో చిత్రాలు వస్తుంటాయి. అసలు ఎవరూ ఊహించని డైరెక్టర్, హీరో కాంబినేషన్ లలో సినిమాలు చేస్తారు. అలా వచ్చిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కూడా. అయితే టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మాస్ మహరాజ్ రవితేజ, డైరెక్టర్ మారుతి కాంబో లో ఓ సినిమా కు ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతోందని అర్ధమవుతుంది.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా సింగిల్ గా వచ్చి ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్నారు హీరో రవితేజ. అలాగే మంచి కథలతో చిన్న చిన్న సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు మారుతి. ప్రేమకథాచిత్రం తో హారర్ మూవీ లో కామెడీ పండించి ఒక కొత్త స్టైల్ ను పరిచయం చేసారు. అప్పట్లో ఆ సినిమా భారీ వసూళ్లను కూడా రాబట్టింది. ఆ తర్వాత ఎక్కువ కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు ఈ దర్శకుడు. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంతో గతేడాది విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ చిత్రం తర్వాత కొత్త కథల్ని సిద్ధం చేయడంపైనే దృష్టి పెట్టారు.
అయితే ఆయన తర్వాతి సినిమా కోసం పలువురు కథా నాయకుల పేర్లు వినిపించినా రవితేజతో సినిమా చేయడం కోసమే మారుతి రంగం సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో సినిమా కథను రవితేజకు వినిపించాడట మారుతి. ప్రస్తుతం పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధమవుతున్నట్టు ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. రవితేజ కొత్త సినిమాల విషయంలో జోరు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు కథలకి పచ్చజెండా ఊపారాయన. ఇప్పటికే ‘క్రాక్‌’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మరి వీరిద్దరి కాంబినేషన్ వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *