covid19 mla,gudivada amarnadh,akp mla,news4,news4us

కరోనాను ఓడించిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్

న్యూస్ 4అజ్ : విశాఖపట్నం: కరోనా వైరస్‌ సోకితే భయపడాల్సిన అవసరం లేదని తగిన జాగ్రత్తలు తీసుకుంటే బయటపడ వచ్చని అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. గత నెల 20న రక్త పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌ వచ్చిందని ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటూ 29వ తేదీన పరీక్షలు చేయించుకుంటే నెగిటివ్‌ వచ్చిందన్నారు. తాను కొంతకాలంగా హోం ఐసోలేషన్‌లో ఉండిపోయానన్నారు. అందువలనే ప్రజలకు అందుబాటులోకి రాలేకపోయానని చెప్పారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని శనివారం నుంచి ప్రజలు తనను కలుసుకోవచ్చునని పేర్కొన్నారు. నియోజకవర్గంలో కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్నాయన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *