ప్రపంచ కుబేరుల్లో 4వ స్ధానం

న్యూస్4అజ్:న్యూఢిల్లీ: భారతీయ అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో దూసుకుపోతున్నారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ సూచీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అధిపతి నాల్గవ స్థానానికి ఎగబాకారు. టాప్‌-500 బిలియనీర్లతో విడుదలైన ఈ తాజా జాబితాలో ముకేశ్‌ సంపద 80.6 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, ఫేస్‌బుక్‌ సారథి మార్క్‌ జూకర్‌బర్గ్‌లు మాత్రమే ఈ జాబితాలో ముకేశ్‌ కంటే ముందున్నారు. నిజానికి దశాబ్దాలుగా ప్రపంచ టాప్‌-5 కుబేరుల్లో అమెరికన్లే ఉంటున్నారు. లేదంటే ఒకరిద్దరు యూరోపియన్లకు స్థానం లభిస్తున్నది. ఎప్పుడో ఒకసారి మెక్సికన్‌ కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆసియా ఖండానికి చెందిన, అదీ ఓ భారతీయుడు ఉండటం తొలిసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *