రోజుకో మలుపు…సుశాంత్ ఖాతా నుంచి భారీగా??

న్యూస్4అజ్: ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు షాకింగ్ ఫైనాన్స్‌ విషయాలను వెల్లడించింది. 2019 మే – 2020 ఏప్రిల్ మధ్య సుశాంత్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు మళ్లింపు జరిగినట్లు తెలిసింది. కాగా, రేపు మరోసారి ప్రశ్నించేందుకు తమ ఆఫీసుకు రావాల్సిందిగా రియాను ఈడీ ఆదేశించినట్లు సమాచారం.సుశాంత్ మరణానికి ఏడాది ముందు నుంచి అతడితో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ తో పాటు మరో సీఏకు చెందిన అకౌంట్లకు సుశాంత్ అకౌంట్ నుంచి రూ.2.63 కోట్ల నిధులు మళ్లించినట్లు సమాచారం. సుశాంత్ తన సోదరి రాణి కోసం రెండు ఫిక్స్ డిపాజిట్లు చేయగా.. రెండు రోజుల తరువాత రెండు ఎఫ్‌డిల నుంచి రూ.2.5 కోట్లు తగ్గించినట్లు తెలుస్తున్నది. ఈ రెండు ఫిక్స్ డిపాజిట్లలో తగ్గింపులు 2019 నవంబర్ 26 న, 28 న జరిగి కొత్త ఫిక్స్ డిపాజిట్లు ఒక్కొక్కటి కోటి రూపాయల చొప్పున చేసినట్లు తెలుస్తున్నది. రియా చక్రవర్తి ఆదేశాల మేరకు రెండు సీఐల ఖాతాలకు రూ.2.63 కోట్లు బదిలీ చేయడం, ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి రూ.2.5 కోట్లు తగ్గించడం జరిగిందని సుశాంత్ కుటుంబం ఆరోపిస్తున్నది. అయితే ఈ విషయంలో సీఎల స్పందన ఇంతవరకు రాలేదు. రియా కూడా వివరణ ఇవ్వలేదు.మనీలాండరింగ్ కేసు నమోదు చేయడం ద్వారా రియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్నది. శుక్రవారం ప్రశ్నించడానికి రియాను పిలిచారు. సుమారు ఎనిమిదిన్నర గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారం. ఆమె సోదరుడు షోవిక్‌ను దాదాపు 20 గంటలపాటు ప్రశ్నించారు. శనివారం ఈడీ కార్యాలయానికి చేరుకున్న షోవిక్ ఆదివారం ఉదయం అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఈ కేసులో రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, సీఎ రితేష్ షా, సుశాంత్ ఫ్లాట్ మేట్ సిద్ధార్థ్ పిథానిలను కూడా ఈడీ విచారించనున్నది.
రియాను సోమవారం మళ్లీ ప్రశ్నించనున్న ఈడీ
శుక్రవారం రియా చాలా ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయినందున సోమవారం మరోసారి ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమైంది. షోవిక్‌ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మరోసారి రియా నుంచి సమాధానాలు రాబట్టేందుకు పిలువనున్నట్లు తెలుస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *