కరోనా నుండి కోలుకున్న వారికి మరో షాకింగ్ న్యూస్!!!

న్యూస్4అజ్: ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా రికవరీ రేటు పెరుగుతున్నా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతోంది. తాజాగా కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు కరోనా నుంచి కోలుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని చెబుతున్నారు.తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో మెదడుకు ముప్పు తప్పదని తేలింది. శాస్త్రవేత్తలు కరోనా నుంచి కోలుకున్న వాళ్ల మెదడులను మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్(ఎమ్మారై) స్కానింగ్ తీసి.. స్కానింగ్ రిపోర్టులను పరిశీలించి ఈ విషయాలను వెల్లడించారు.జర్నల్ ద లాన్స్ట్ లో ఈ మేరకు కథనం ప్రచురితమైంది. కరోనా నుంచి కోలుకున్న వాళ్ల ఎమ్మారై స్కానింగ్ రిపోర్టులను పరిశీలించి సాధారణ వ్యక్తుల మెదడుకు, కరోనా సోకిన వాళ్ల మెదళ్లకు తేడా ఉందని వైద్యులు చెబుతున్నారు.కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో వాసనను గుర్తించే శక్తిని కోల్పోవడం, జ్ఞాపకశక్తిని కోల్పోవడం లాంటి లక్షణాలను గుర్తించామని తెలిపారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వాళ్లలో నాడీ సంబంధ సమస్యలు సైతం గుర్తించామని తెలిపారు. దీని గురించి మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో గుర్తించిన సమస్యలపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.11 మంది చైనా పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారని సమాచారం. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. ఏపీలో ప్రతిరోజూ 10,000కు పైగా కరోనా కేసులు నమోదవుతూ ఉండగా తెలంగాణలో 2,000కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎన్ని చర్యలు చేపడుతున్నా కరోనా కేసులను తగ్గించడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు. మరోవైపు ఈ నెల 12వ తేదీన కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *