న్యూస్4అజ్: తెలుగు రాష్ట్రాలను మబ్బులు ఆవరించాయి. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు మొదలై భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి.
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ ప్రాంతల మీదుగా విస్తరించి ఉంది. దీని కారణంగా సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. ఈ అల్పపడిన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మత్స్యకారులు కూడా అప్పమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. వాన కబురుతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.