3 రాజధానులు…జగన్ కి మరో షాక్…

న్యూస్4అజ్: మూడు రాజధానులు ఇపుడు ఏపీని కుదిపేస్తున్నాయి. చంద్రబాబు కలల రాజధాని అమరావతిని మూడవ వంతు చేసి విశాఖ, కర్నూల్లో రాజధానులు అభివ్రుధ్ధి చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. విశాఖలో రాజధాని పెడితే పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయని కూడా వైసీపీ అంచనాలు వేసుకుంటోంది.దానికి తోడు ఉత్తరాంధ్రా జిల్లాలు రాజకీయంగా తోడుగా బాసటగా ఉంటాయని కూడా భావిస్తోంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలు కూడా తమ వైపే ఉంటే ఎటూ రాయలసీమ నెల్లూరు, ప్రకాశం వైసీపీకే అనుకూలం కాబట్టి మొత్తంగా 11 జిల్లాల్లో పాగా వేయవచ్చునని జగన్ ఆలోచన చేస్తున్నారు.ఈ క్రమంలో ఆయన మూడు రాజధానులకు గట్టిగా పట్టుబట్టారు. అయితే జగన్ ఏడాది పాలనలో ఏ నిర్ణయానికి రాని వ్యతిరేకత మూడు రాజధానుల విషయంలో వచ్చిదని అంటున్నారు.దీని మీద జగన్ సొంత పత్రిక ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సర్వే చేయిస్తే 62 శాతానికి పైగా ప్రజలు మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా తేలిదంట.దీంతో వైసీపీ సర్కార్ అయోమయంలో పడిందని అంటున్నారు.ఇక అమరావతి విషయంలో ఎవరికీ అభిప్రాయాలు ఉన్నా అసలు రాజధాని లేదనుకున్న వేళ చంద్రబాబు ఏదో ప్రారంభించారు కదా దాన్ని కొనసాగిస్తే పోలా అన్నది జనం ఆలోచనగా ఉందిట. ఇక విశాఖ సహా మిగిలిన నగరాలకు రాజధాని పేరు ఎందుకు అభివ్రుధ్ధి చేయడానికి బోలెడు మార్గాలు అని మేధావులు అంటున్నారుట. మొత్తం మీద చూస్తే న్యాయ రాజధాని ఇస్తే రాయలసీమ సంత్రుప్తి చెందడం లేదు, ఇక విశాఖ రాజధాని అంటే అక్కడ జనాలు పెద్దగా రెస్పాండ్ కావడంలేదు, కానీ అమరావతి వాసులు మాత్రం నిండా మునిగామని వాపోతున్నారు. దీంతో ఈ పరిణామాలు ఏపీ సర్కార్ కి రాజకీయంగా మంచిది కాదని అంటున్నారు. ఉన్నది తక్కువ టైం. మరో నాలుగేళ్ళలో ఎన్నికలు వస్తాయి. ఈ లోగా అభివ్రుధ్ధి చేయకపోతే మొదటికే చేటు అన్న మాట కూడా ఉంది.

One thought on “3 రాజధానులు…జగన్ కి మరో షాక్…”

  1. True… Stripping lands from Amaravati and Guntur farmers for capital and now changing it to vizag makes them vulnerable and indigent. He is just doing it to satisfy his ego against Cbn, definitely gonna loose next elections if he changes capital..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *