నకిలీ ఐఏఎస్ అధికారిని అరెస్ట్

న్యూస్4అజ్: ఐఏఎస్ అధికారిణి అంటూ వైద్యుల వద్ద నగదు వసూలు చేస్తున్న ఓ మహిళను హనుమాన్ జంక్షన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.ఇక వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా కు చెందిన పెమ్మడి విజయలక్ష్మి(65)అనే మహిళ రిటర్డ్ ఐఏఎస్ అధికారిణి సుజాత రావు పేరు చెప్పి తాను తిరుపతి వెంకన్న దర్శనానికి వెళుతున్నానని డాక్టర్ పేరు మీద తిరుపతిలో గరుడ పూజ చేయిస్తానని 3500 నగదు వసూలు చేస్తోంది.ఈ నెల 8వ తేదీన హనుమాన్ జంక్షన్ లోని సీతా మహాలక్ష్మి నర్శింగ్ హోమ్ కు వెళ్లి పూజ నిమిత్తం 3500 ఇవ్వాలని కోరింది.ఆసుపత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంస్కరణల కమిటీ సలహాదారు డా దుట్టా రామ చంద్రరావుది కావడంతో సిబ్బందికి అనుమానం వచ్చి దుట్టా తనయుడు రవి శంకర్ కు సమాచారం అందించారు.అసలు ఐఏఎస్ అధికారిణి సుజాత రావుకు ఫోన్ చేయగా తాను హైదరాబాద్ లో ఉన్నానని చెప్పారు.ఆయన ఆసుపత్రికి వచ్చేసరికి మహిళ అక్కడ నుంచి ఉడయించడంతో రవిశంకర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు.గత రాత్రి నకిలీ ఐఏఎస్ విజయలక్ష్మి ఆచూకీ కనుగొన్న పోలీసులు ఆమెను సోమవారం ఉదయం అరెస్టు చేశారు.కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే నింది నిందితురాలిని అరెస్టు చేయడంతో హనుమాన్ జంక్షన్ సి ఐ రమణ, ఎస్ ఐ మదీనా భాష మరియు ఇతర సిబ్బందిని డి.ఎస్.పి అభినందించారు.ఆమె గతంలో ఐఏఎస్ అధికారిని సుజాత రావు పేరు చెప్పి నందిగామ, హైదరాబాద్,విజయవాడ ఏరియాల్లో నగదు వసూలు చేసినట్లు డిఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *