అలిపిరి వద్ద అక్రమ మద్యం కలకలం

న్యూస్4అజ్: తిరుమలకు భారీగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు కలకలం రేపింది. నిబంధనలకు విరుద్దంగా.. ఏడుకొండల పవిత్రతకు భంగం కలిగేలా కొందరు ప్రవర్తిస్తున్నారు. కలియుగ దైవం ప్రత్యక్ష దైవం కొలువైన కొండ సమీపంలో మద్యం సీసాలను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలిపిరి దగ్గర ఎస్‌ఈబీ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న 572 కర్నాటక మద్యం ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటు, తిరుమల నగర్‌కు చెందిన మని భాస్కర్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. అటు ఆటోనగర్ వద్ద వాహన తనిఖీలలో 174 కర్నాటక మద్యం ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారు, టూ వీలర్‌ను సీజ్ చేశారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడిన ఎల్ఎస్‌నగర్‌కు చెందిన గౌస్ బాష, దామినీడుకు చెందిన వెంకటేశ్‌లను ఎస్ఈబీ ఏఈఎస్ సుదీర్ బాబు అరెస్ట్ చేశారు. నిందితులపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *