అజిత్‌పై ప్రేమ కురిపించిన కార్తికేయ.. కారణం అదేనా?

తమిళ స్టార్ హీరో అజిత్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 28 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ సోషల్ మీడియా ద్వారా అజిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనపై తనకున్న ప్రేమను కార్తికేయ చాటుకున్నారు. అజిత్ తనకు స్ఫూర్తి అని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ట్వీట్ చేశారు. ‘‘ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి ఎన్నో ఇబ్బందులు, మరెన్నో వైఫల్యాలు ఎదుర్కొని, ప్రతిసారి తనను తాను నిరూపించుకుంటూ దృఢంగా మారి తమిళ సినిమాలో ‘తల’గా అవతరించారు. మీ ప్రయాణంలో ప్రతి పేజీని ఒక స్ఫూర్తిగా తీసుకుంటాం సార్. 28 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అభినందనలు’’ అని కార్తికేయ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *