సంజయ్ దత్ కు లంగ్ క్యాన్సర్…

న్యూస్4అజ్: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆరోగ్యానికి సంబంధించి ఒక సంచలన అంశం బయటకొచ్చింది. ఆయనకు తాజాగా స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. నిజానికి ఆయనకు శ్వాస సంబందిత సమస్యలు రావడంతో మొన్న శనివారం ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో మూడు రోజుల పాటు వైద్యుల సంరక్షణలో ఉన్న ఆయన నిన్ననే ఇంటికి వచ్చారు. ఈ సమయంలో తను బాగానే ఉన్నాయని ఆయన చెప్పారు.
అయితే ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలో కొన్ని పరీక్షలు చేశారని, ఆ పరీక్షా ఫలితాలు కొద్ది సేపటి కిందట వెలువడగా వాటిలో ఆయనకు క్యాన్సర్ అన్న విషయం తేలింది. దీంతో ఆయన ఇప్పుడు చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. ఈ క్యాన్సర్ నయం అయ్యేదేనని కాకపోతే మేడికేషన్ వెంటనే మొదలు పెట్టాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *