చేయూత సాయం పంపిణీ నేటి నుంచే…వైఎస్ జగన్

న్యూస్4అజ్: విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాల పథకాల్లో వైఎస్సార్‌ చేయూత ఒకటి. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తోడ్పాటు అందించడమే ఈ పథకం ఉద్దేశం. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు ఏడాదికి రూ. 18,750 చొప్పున నాలుగేళ్లలో రూ. 75 వేలు సాయం దక్కనుంది. చేయూత ద్వారా లబ్ధిపొందడానికి మహిళల నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులొచ్చాయి. వాటిని వాలంటీర్లతో పరిశీలన చేయించి, సామాజిక తనిఖీలతో అనర్హులను ఏరివేశారు. తుది జాబితాలను ఆయా సామాజిక కార్పొరేషన్లు సిద్ధం చేశాయి. బుధవారమే తొలివిడత సొమ్ములు లబ్ధిదారుల ఖాతాల్లోకి సర్కారు జమ చేయనుంది. సామాజిక తనిఖీల అనంతరం 1.87 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *