HMWSSB, ghmc, BILLS,TAX,telangana,goverrnment

హైదారాబాద్ నీటి సప్లై అధికారుల విలయ తాండవం..బిల్లు కోసం డ్రైనేజ్ నీటిని వదిలేస్తూ వేధింపు..

న్యూస్4అజ్: హైదరాబాద్ :  హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై మరియు సెవెరజ్ బోర్డు (HMWSSB) తీరు పుండు మీద కారం జల్లేట్టుగా ఉంది.. తినటానికే కష్టంగా ఉన్న తరుణంలో వాటర్ బిల్లులను ముక్కు పిండి మరీ వాసులు చేస్తూ ప్రజలతో ఆడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే నారాయణగూడా క్రాస్ రోడ్ బిల్డింగ్ లో నీటి బిల్లు కట్టకపోతే నీటి కనెక్షన్ ను నిలిపి వెయ్యాలి బిల్లు కట్టినాక నీటి కనెక్షన్ ను ఇస్తామనటం సాధారణం గా జరిగే తీరు కానీ ఇప్పుడు కరోనా సీజన్ లో అధికారులకు బుర్ర లో కొత్త ఆలోచనలు వస్తున్నాయేమో నీటి కనెక్షన్ ను కట్ చేసి డ్రైనేజ్ నాలా ను బ్లాక్ చేస్తూ ఎలా బిల్లు కట్టరో చూస్తామనేలా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఉన్న కుళ్ళు చాలక మురుగు పెంట నీరు పైకి వెదజల్లేలా చేస్తూ ఆ దుర్గంధ గబ్బు కి చుట్టు పక్కల వాళ్ళు ఉండలేక చచ్చేలా చేస్తున్నారు. అసలే అంతంత మాత్రం శుభ్రం పాటిస్తున్న మున్సిపల్ కార్పోరేషన్ శుభ్రానికి పెంట ఏడ్ అయితే ఇక కరోనా కాదు దాని పెనిమిటి కూడా దిగి వస్తది.. అసలు ప్రస్తుత పరిస్ధితులలో ఆర్ధిక సమస్యలతో నడుస్తున్న తరుణంలో ఏ చెట్టుకు తగ్గ ఆ గాలి ఉంటది. వ్యాపారస్ధులకు వ్యాపారాలు లేక యజమానులకు సరిగ్గా అద్దెలు రాక ప్రైవేట్ ఉద్యోగస్ధులకు ఉద్యోగాలు లేక ఉద్యోగాలు ఉన్నా జీత భత్యాలు లేక అలమటిస్తున్న తరుణంలో కనీస అవసరం అయినా తాగు నీటిని బిల్లు కట్టనందున కనెక్షన్ నిలిపి వెయ్యటమే కాక డ్రైనేజ్ ని బ్లాక్ చేసి ఆ మురుగు తో ఇబ్బందులు పెట్టే తీరుని ఏమనాలో అర్ధం కానీ పరిస్ధితిలో ఉన్నట్లుంది. మారటోరియం అంటూ ప్రైవేట్ సంస్ధలకు చెప్పటం కాదు ప్రభుత్వం పాటించాలి. కనీస అవసరం అయినా నీటిని కూడా నిలిపి వెయ్యటం అంటే ఎంత దారుణమో అర్ధం చేసుకోవచ్చు. ఇంతలా కరోనా విజృంభిస్తున్న తరుణంలో అసలు నీటి బిల్లు కట్టకపోతే కేవలం నీటిని మాత్రమే బ్లాక్ చేయాలి.డ్రైనేజ్ ని బ్లాక్ చేస్తే జరిగేది ఏమిటంటే కరోనా కేవలం విజ్రింభించటమే కాదు కరోనా విలయ తాండవం కూచి పూడి నాట్యం కూడా చేస్తది.అప్పుడు కడతారు ప్రజలు నీటి బిల్లులు పన్నులు ను దీనిపై నీటి సరఫరా అధికారులు మాకు పై నుండి ప్రభుత్వ  ఒత్తిడితోనే ఇలా చేస్తున్నామనటం ఇంకో ట్విస్ట్. ఇప్పటికైనా HMWSSB శాఖ ఇలాంటి తీరును మానుకొని బకాయిలు పన్నులు ఎలా వసూలు చెయ్యాలో మానవత్వంతో ఆలోచించి చెయ్యాలని లేకుంటే చావు కార్యక్రమానికి వెళ్లి పక పకా నవ్వినంత వెటకారంగా ఉంటదని స్థానికులు అధికారుల తీరు పై హాస్యం తో అంటున్నారు.ఇప్పుడు అధికారుల తీరు చేసాక కరోనా కంటే ఈ వాటర్ సప్లై అధికారులే భయంకరంగా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *