పనిలోకి రాలేదని బాలుడిపై పైశాచికత్వం!

న్యూస్4అజ్: నిజామాబాద్: 12 ఏళ్ల బాలుడిని పనిలో పెట్టుకోవడమే కాకుండా ఓ వ్యక్తి అతని పట్ల రాక్షసంగా ప్రవర్తించాడు. పనిలోకి రావడం లేదని చెట్టుకు కట్టేసి చితకబాదాడు. కొట్టొద్దని ఆ బాలుడు యజమానిని ఎంతగా బతిమాలినా వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా కాళ్లకు తాడు కట్టి బాలుడిని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. నిజామాబాద్‌ జిల్లాలోని మల్కాపూర్‌ (ఎ) లో బుధవారం ఈ దారుణం వెలుగుచూసింది. బాలుడిని యజమాని చిత్ర హింసలకు గురిచేస్తున్నా జనమంతా చోద్యం చూశారే తప్ప ఏ ఒక్కరూ ఆపలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *