కరోనా చికిత్సగా ఏనుగు లద్దెలు…ఏమిటో…

న్యూస్4అజ్: విండ్‌హోక్: ఆఫ్రీకా దేశమైమన నమీబియాలో కొత్త కరోనా చికిత్స సోషల్ మీడియాలో తెగ వైరలై ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అవే..ఏనుగు లద్దెలు.. అవును! ఏనుగు లద్దేల ప్రభావానికి కరోనా గుడ్లు తేలేస్తుందని, రోగం చిటికలో నయమైపోతుందనే వదంతి ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రజలు కూడా దీన్ని నమ్ముతుండటంతో అక్కడ ఏనుగు లద్దెల వ్యాపారం జోరందుకుంది. సామాజిక మాధ్యమాల్లో కొంత మంది లద్దెలమ్మేసుకుంటూ సొమ్ము చేసేసుకుంటున్నారు. కరోనా భయంతో నిస్సాహాయులైన ప్రజల ధనాన్ని సునాయాసంగా బొక్కేస్తున్నారు. ఈ విషయం తెలిసి ఉలిక్కిపడ్డ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసేందకు రంగంలోకి దిగింది. ఇటువంటి వదంతులను నమ్మొద్దంటూ ప్రజలను హెచ్చరిస్తోంది.

ఇక తాజా లెక్కల ప్రకారం నమీబియాలో ఇప్పటివరకూ 4464 కరోనా కేసులు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *