న్యూస్4అజ్: నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన చిత్రం వి. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమేజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమా విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 5 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. నాని, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ప్రకటించారు.
విడుదలకు ముందే ఎన్నో అంచనాలు రేకెత్తించిన ఈ సినిమా ఉగాది రోజున ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే లాక్డౌన్ కారణంగా విడుదల కుదరలేదు. గతంలో ఓటీటీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా నిర్మాత దిల్ రాజు మరో ఆలోచన లేకుండా తిరస్కరించారు.వి సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నారు
అయితే ఇప్పట్లో అది సాధ్యపడదనే క్లారిటీ రావడంతో ఓటీటీ వేదికగా విడుదల చేయడానికి సిద్ధపడ్డారు.