హైదరాబాద్ స్టార్ట్ అప్ యుఎస్9 మాస్కల తయారీ..

న్యూస్4అజ్: హైదరాబాద్‌: నగరంలోని ఐఐటీకి చెందిన సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంట్రిప్రెన్యూర్‌షిప్‌(సీఎఫ్‌హెచ్ఈ) ప్రోత్సహిస్తున్న యూ సేఫ్ హెల్త్‌కేర్ అనే స్టార్ట్ అప్ కొత్త తరహా మాస్క్‌ను తయారు చేసింది. ఎన్‌95 తరహా లాంటి మాస్క్‌ను ఆ స్టార్ట్ అప్ డెవలప్ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్క్‌లకు ఫుల్ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. యూఎస్9 పేరుతో ఆ మాస్క్‌లను విడుదల చేశారు. గాంధీ, ఒస్మానియా, ఫీవర్ హాస్పిటల్స్‌లో పనిచేసే వైద్యులు ఆ మాస్క్‌లను టెస్ట్ చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఎన్‌95 మాస్క్‌ల కన్నా తక్కువ ధరకే యూఎస్‌9 మాస్క్‌లను విక్రయించనున్నారు. యూఎస్9 మాస్క్‌ను మళ్లీ మళ్లీ వాడేవిధంగా తయారు చేశారు.మాస్క్ ఫిల్ట్రేషన్ రేటు 98 శాతంగా ఉన్నది. బ్యాక్టీరియా ఫిల్ట్రేషన్ 99.7 శాతంగా ఉన్నది. బ్రీత్ఎబిలిటీ పరీక్షలను యూఎస్‌9 మాస్క్‌లు పాసైనట్లు స్టార్ట్ అప్ ఓనర్లు చెప్పారు. మాస్క్‌లో డ్యుయల్ మోడ్‌కు చెందిన రీయూజబుల్‌, రీప్లేసబుల్ ఫిల్టర్లు ఉన్నాయి. సౌత్ ఇండియా టెక్స్‌టైల్ రీసర్చ్ అసోసియేషన్ కూడా మాస్క్ ఫిల్ట్రేషన్ క్యాట్రిడ్జ్‌లకు సర్టిఫికెట్ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *