ఆ అపార్ట్మెంట్ లిఫ్ట్ బటన్ తో అందరికి కరోనా..

న్యూస్4అజ్: ఖమ్మంలోని ఓ అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌ వాడిన వారిలో 20 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. స్థానిక బైపాస్‌ రోడ్డులోని ఆ అపార్టుమెంట్‌లో ఐదు అంతస్తులున్నాయి. వీరిలో ఎవరికి, ఎప్పుడు వైరస్‌ సోకిందో కానీ.. రెండు వారాల్లో 20 మందికి వ్యాపించింది. ఓ వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. అయితే, గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఒక్కరికీ వైరస్‌ నిర్ధారణ కాకపోవడం.. పై అంతస్తులవారు ఉమ్మడిగా లిఫ్ట్‌ వినియోగించడం చూస్తే వైరస్‌ అక్కడి నుంచే అంటుకున్నట్లు తేలింది. దీంతో వాచ్‌మన్‌ కుటుంబం వెళ్లిపోయింది. పాజిటివ్‌ వచ్చినవారు క్వారంటైన్‌ కావడం, అపార్ట్‌మెంట్‌లోని మిగతావారు బయటకు వచ్చేందుకు జంకడంతో నిత్యవసర సరుకులు తెచ్చేవారు కరువై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరోవైపు తెలంగాణలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2932 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 11 మంది మరణించారు. 1580 మంది డిశ్చార్జి అయ్యారు.

జీహెచ్ఎంసీ పరిధిలోనే 520 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 17,415కి చేరింది. 87,675 కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 799 మంది చనిపోయారు.

ప్రస్తుతం తెలంగాణలో 28,941 యాక్టివ్ కేసులున్నాయి. 22,097 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. మరో 771 రిపోర్టులు రావాల్సి ఉంది. ఇక ఊరటనిచ్చే విషయం ఏంటంటే..

రాష్ట్రంలో మరణాల సంఖ్య తక్కువగానే ఉంది. దేశంలో మరణాల రేటు 1.83గా ఉంటే తెలంగాణలో 0.68గా నమోదయింది. దేశంలో కరోనా రికవరీ 76.33గా ఉంటే.. తెలంగాణలో 74.6గా ఉంది. టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 61,863 శాంపిల్స్ పరీక్షించారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,04,343 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *