విద్యార్థికి అండగా సోనూ సూద్..

న్యూస్4అజ్: చూస్తూ ఉంటే బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సహాయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారినట్టు ఉన్నాడు. లాక్ డౌన్ లో మొదలెట్టిన సాయాలను ఇంకా కొనసాగిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా పరాయి రాష్ట్రాల్లో, విదేశాల్లో చిక్కుకున్న ఎందరినో సొంతిళ్లకు చేర్చాడు. ఉద్యోగం లేదు అన్నా అంటే తెలిసిన కంపెనీలో జాబ్ ఇప్పించాడు. వ్యవసాయం చేసేందుకు ఎద్దులు లేక కూతుళ్లనే కాడెద్దులుగా మార్చిన సంఘటన గురించి తెలుసుకుని సాయంత్రానికి ఇంటికి కొత్త ట్రాక్టర్ పంపించాడు. రోజుకి ఒకరికైనా సహాయం చేయకుండా ఉండలేకపోతున్నాడు.
తాజాగా ఓ విద్యార్థికి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించాడు. ‘సోనూ సార్ నాకు బిఏ చదవాలని ఉంది. అడ్మిషన్ కోసం నా దగ్గర డబ్బు లేదు.

దయచేసి రెండవ సంవత్సరంలో ప్రవేశం ఇప్పించండి. లాక్ డౌన్ కారణంగా నాకు ఏ పని రావడం లేదు. సార్ నాకు సహాయం చేయండి.’ అని ఓ విద్యార్ధి సోనూ సూద్ కి ట్వీట్ చేసాడు. దీనికి సోనూ సూద్ స్పందిస్తూ.. అడ్మిషన్ పూర్తి అయిందని ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *