న్యూస్4అజ్: పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు తమ తయారీ ప్లాంట్ లను ఆంధ్రప్రదేశ్ నెలకొల్పడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ కియా తన తయారీ యూనిట్ ని రాయలసీమ ప్రాంతంలోని అనంతపురంలో ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా మరో అంతర్జాయతీయ కంపెనీ రాయలసీమ ప్రాంతనికి రానుందని తెలుస్తోంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఆపిల్ తమ తయారీ యూనిట్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడానికి సిద్ధమౌతోంది. ఈ యూనిట్ ను ఏర్పాటు చేయడానికి ఆపిల్ సంస్థ కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక ఏరియాను ఎంచుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ‘ఆపిల్ కంపెనీకి చైనాలో ఆరు తయారీ యూనిట్స్ ఉన్నాయి. అక్కడ ఒక్కో తయారీ యూనిట్ లో లక్ష నుండి ఆరు లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారు. అదే తరహా మోడల్ ను కడపలో నిర్మించడానికి ఆపిల్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం. కడపలో నిర్మించబోయే తయారీ యూనిట్ ద్వారా దాదాపు యాభైవేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం.’ అని అన్నారు.
