news4 covid positive

సినీ నటి,ఎంపీ నవనీత్ రాణాకు కరోనా పాజిటివ్

న్యూస్ 4 అజ్: ముంబై: సినీ నటి, ఎంపీ నవనీత్ రాణాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఆమె నివాసంలోని 11 మంది కరోనా బారిన పడ్డారు. తొలుత నవనీత్ మామ గంగాధర్ రానాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. నవనీత్‌కు, ఆమె భర్తకు కరోనా టెస్టులు నిర్వహించారు. దాదాపు 60 మంది సభ్యులు, కార్యకర్తలకు కరోనా పరీక్షలు చేశారు. నవనీత్ కౌర్ ఇంటి ప్రాంగణాన్ని వైద్య ఆరోగ్య శాఖ శుభ్రం చేయించింది. అయితే.. నవనీత్ రానా, ఆమె భర్త రవిరానా శాంపిల్స్ వైద్యులు తప్పుగా తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై.. వైద్యఆరోగ్య శాఖకు రవి రానా ఫిర్యాదు చేశారు. దీంతో.. మళ్లీ వీరిద్దరి శాంపిల్స్‌ తీసుకున్నారు. నవనీత్ రిపోర్ట్‌లో రిజల్ట్ పాజిటివ్‌గా తేలింది. నవనీత్ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *