న్యూస్4అజ్ : కరోనా సమయంలో కూడా వ్యాపారంలో వృద్ధి చెందుతున్నందున అమెజాన్.. అమెరికాలో 33,000 ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు బుధవారం తెలిపింది. కార్పొరేట్, టెక్ స్థానాల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నది. వీటిలో అలెక్సా, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఆపరేషన్స్ టెక్నాలజీ, ప్రైమ్ వీడియోలో ఖాళీలు ఉన్నాయి. కరోనా దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తోంది. ప్రజలు తిరిగి పనిలోకి వచ్చే అవకాశం కోసం ఆసక్తిగా ఉన్నారుఁ అని అమెజాన్ మానవ వనరుల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. మేము గత దశాబ్దంలో యూఎస్‌లో ఇతర కంపెనీల కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించాం.మేము అన్ని నేపథ్యాల నుంచి, అన్ని నైపుణ్య స్థాయిల్లోని వ్యక్తులను నియమించుకుంటాం అని ఆయన తెలిపారు. అమెజాన్ తన 2020 కెరీర్డే ఈవెంట్‌ను సెప్టెంబర్ 16న నిర్వహించనుందని చెప్పారు.
