నెల్లూరు మునిసిపల్‍ కమీషనర్‍గా దినేష్‍ తట్టుకోగలరా..?

న్యూస్4అజ్: నెల్లూరు మునిసిపల్‍ కార్పోరేషన్‍ కమీషనర్‍గా గత సంవత్సరం నుండి బాధ్యతలు నిర్వహించిన అధికారులందరూ బదిలీ అయ్యారు. కొత్త కమీషనర్‍గా తెనాలి సబ్‍ కలెక్టర్‍ దినేష్‍కుమార్‍ను ప్రభుత్వం నియమించింది. నెల్లూరు మునిసిపల్‍ కమీషనర్‍గా పనిచేయాలంటే.. కత్తి మీద సాములా ఉంటుందని.. అధికారులకు అనుభవంతో కానీ తెలిసిరాలేదు. మంత్రి అనీల్‍ కుమార్‍ యాదవ్‍, గౌతమ్‍రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‍రెడ్డి దెబ్బకు అధికారులు పారిపోతున్నారని ప్రచారం జరుగుతోంది.. ఆ ప్రచారాన్ని మంత్రి అనిల్‍కుమార్‍, కోటంరెడ్డిలు ఖండించారు. ఇంతకు ముందు కమీషనర్‍గా వచ్చిన బాపిరెడ్డి మూడు నెలలు తిరగకుండానే బదిలీ అయ్యారు. రోజులు గడిచాక.. కొత్త కమీషనర్‍ నియామకం జాప్యం జరగటంతో.. అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదట.

చివరకు ఇంఛార్జి కమీషనర్‍గా బాధ్యతలు తీసుకునేందుకు జిల్లాస్థాయి అధికారులు ముందుకు రాకుండా.. వెనకడుగు వేశారంటే.. అక్కడ కమీషనర్‍గా పని చేయటం చాలా కష్టమని వారందరూ భావించి ఉంటారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల అదనపు కమీషనర్‍కు ఇంఛార్జి బాధ్యతలు అప్పజెప్పగా.. ఆయన అనారోగ్య కారణాలతో శెలవు పెట్టి వెళ్లటంతో… మళ్లీ ఇంఛార్జి కమీషనర్‍గా బాధ్యతలు మునిసిపల్‍ ఇంజనీర్‍కు అప్పజెప్పారు. అలాగే కార్పోరేషన్‍ పరిలో ఉన్న అనేక విభాగాలు ఇంఛార్జిల పాలనతోనే జరుగుతున్నాయి. శాశ్వత అధికారులను నియమించాల్సిన మునిసిపల్‍ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలకే పరిమితమం అవుతూ విశాఖ నగరంలోనే ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి. నెల్లూరు నగరం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి అయిన అనిల్‍ కుమార్‍ యాదవ్‍, నెల్లూరు రూరల్‍ ఎమ్మెల్యే శ్రీదర్‍రెడ్డిల వ్యవహరశైలి వలనే అధికారులు ముందుకు రావటం లేదని.. అధికార ప్రజా ప్రతినిధులు, అధికార నేతలే తెర వెనుక మీడియా ప్రతినిధులకు చెబుతున్నారు. తాజాగా నిజాయితీపరుడు, సమర్ధుడిగా పేరున్న యువ ఐఎఎస్‍ అధికారి దినేష్‍కుమార్‍ను మునిపిల్‍ కమీషనర్‍గా నియమించటంతో.. ఆయన అక్కడ ఎంత కాలం పనిచేస్తారనే వ్యాఖ్యలు అప్పుడే వినిపిస్తున్నాయి.

స్వతహాగా నెమ్మదస్తుడు.. నిజాయితీపరుడు, సమర్దుడు అయిన యువ ఐఎఎస్‍ అధికారిగా పేరుతెచ్చుకున్న దినేష్‍కుమార్‍ సబ్‍ కలెక్టర్‍గా సమర్ధవంతంగా పనిచేశారని ప్రశంసలు కూడా పొందారు. దినేష్‍కుమార్‍ను నెల్లూరు మునిసిపల్‍ కమీషనర్‍గా నియమించటం ఆయన ఎలా నెగ్గుకు రాగలరు.. అక్కడున్న రాజకీయ పరిస్థితులను ఎలా తట్టుకోగలరు. ఇంతకు ముందు మునిసిపల్‍ కమీషనర్‍ వలె మూడు నెలలకే వెళ్లిపోవటం ఖాయమని స్థానిక మునిసిపల్‍ అధికారులు చెప్పుకుంటున్నప్పటికీ.. దినేష్‍ కుమార్‍ పనితీరు తెలియక వారు ఆ విధంగా మాట్లాడుతున్నారని.. కమీషనర్‍గా సమర్ధవంతంగా ఆయన మిగతా వారి కన్నా ఎక్కువ కాలం పనిచేయటం ఖాయమని.. దినేష్‍కుమార్‍ పనితీరు,ఆయన వ్యవహారశైలి తెలిసిన వారు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *