కర్నూల్ లో విషాదం..చిన్నారి ప్రాణాన్ని తీసిన బిస్కెట్లు..

న్యూస్4అజ్: పిల్లలు ఇష్టంగా తినే బిస్కెట్.. ఓ కుటుంబంలో విషాదం నింపింది. బిస్కెట్ తిని ఆరేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని చింతకొమ్ముదిన్నె గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. చింతకొమ్ముదిన్నె గ్రామానికి చెందిన మాబు వద్ద ఆయన మనవడు, మనవరాళ్లు హుస్సేన్‌భాష, జమాల్‌బీ, హుస్సేన్‌బీ డబ్బులు తీసుకుని.. సమీపంలోని ఓ షాపులో బిస్కెట్ ప్యాకెట్ కొని తెచ్చుకున్నారు. అందులోని బిస్కెట్లు తలకొన్ని బిస్కెట్ల్ తిన్నారు. అయితే ఆ కొద్దిసేపటికే వారికి కడుపనొప్పి మొదలైంది.ఈ విషయాన్ని పిల్లలు పెద్దలకు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు వారిని తక్షణమే ఆళ్లగడ్డలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హుస్సేన్‌భాష మృతిచెందాడు. మిగతా ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని కర్నూలుకు తరలించారు. కాగా, చిన్నారులు కొనుగోలు చేసిన బిస్కట్ ప్యాకెట్‌పై రోజ్ మ్యాంగో అనే పేరు ఉంది.చిన్నారులు బిస్కెట్‌లు తిన్న వెంటనే అస్వస్థతకు లోనయ్యారని, ఆహారం పూర్తిగా విషతుల్యమైందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన కేసుల నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బిస్కెట్ ప్యాకెట్‌పై కాలపరిమితి 2020 వరకు ఉందని.. కానీ పిల్లలకు ఇలా కావడానికి కారణాలపై విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *