బాహుబలి బాలయ్యకు షాక్ ఇచ్చాడా….

న్యూస్4అజ్: బాలయ్యకు షాక్ ఇచ్చాడు బాహుబలి. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. ఇంతకీ.. మేటర్ ఏంటంటే… నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన చిత్రాల్లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రం ఆదిత్య 369. ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ప్రేక్షకాభిమానులకు ఓ కొత్త అనుభూతి కలిగించిన ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ గా ఆదిత్య 999 మూవీ చేయాలనుకున్నారు. ఎప్పటి నుంచో ఈ మూవీ వార్తల్లో ఉంటుంది కానీ.. సెట్స్ పైకి రావడం లేదు. అయితే.. ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావును ప్రభాస్ – నాగ్ అశ్విన్ కోసం తీసుకోవడంతో చర్చనీయాంశం అయ్యింది.. అసలు విషయం బయటపడింది.ఏంటా అసలు విషయం అంటే… ప్రభాస్ – నాగ్ అశ్విన్ మూవీ ఎనౌన్స్ చేసారు కానీ.. జోనర్ ఏంటి అనేది ప్రకటించలేదు. దీంతో రకరకాల కథనాలు వచ్చాయి.
ఇప్పుడు తెలిసింది ఏంటంటే.. ఇది టైమ్ మిషన్ కాన్సెప్ట్ తో రూపొందే సినిమా అట. అందుకనే టైమ్ మిషన్ కాన్సెప్ట్ తో సినిమా తీసి సక్సస్ సాధించిన సీనియర్ డైరెక్టర్ సింగీతంను ఈ మూవీ కోసం తీసుకున్నారు. అయితే..
సింగీతం ఈ మూవీలోకి రావడంతో ఒక విధంగా బాలయ్యకు బాహుబలి షాక్ ఇచ్చారని చెప్పచ్చు. ఎందుకంటే.. బాలయ్యతో ఆదిత్య 999 ప్లాన్ చేసారు సింగీతం.బాలయ్య ఓకే అన్నారు కానీ.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. బాలయ్య టైమ్ మిషన్ కాన్సెప్ట్ తో తీయాలనుకున్న కథతో బాహుబలి ప్రభాస్ మూవీ చేస్తుండడంతో బాలయ్యకు బాహుబలి షాక్ ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి..ఇప్పుడైనా బాలయ్య ఆలోచనలో స్పీడు పెంచి ఆదిత్య 999 మూవీని స్టార్ట్ చేస్తాడేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *