న్యూస్4అజ్: ప్రజల కోసమే రాజకీయం… ప్రజలకు మేలు చేసే పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేస్తా…వాసుపల్లి గణేష్ కుమార్…
గత 14 నెలలు గా తమ దక్షిణ నియోజకవర్గంలో అభివృద్ది పనులు పెండింగ్ లొనే ఉన్నాయని వాటిని పూర్తి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరానన్నారు దీంతో స్పందించిన ముఖ్యమంత్రి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పారు. డైనమిక్ సీఎం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతున్న తరుణంలో ఆ పార్టీలో చేరడమే కరెక్ట్ అని వైఎస్సార్సీపీ పార్టీలో చేరనున్నట్లు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి వెల్లడించారు. పేద వాడిని ఆదుకునే ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అన్నారు. 14 నెలల్లో అత్యధిక సొమ్మును సంక్షేమ పథకాలు కట్టబెట్టిన ఘనత సీఎం జగన్ కే చెందుతుందన్నారు. ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించాలని ఆ బాధ్యత తెలుగుదేశంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి పని లేకుండా చేసిన ప్రభుత్వమే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం. విశాఖ మేయర్ ఎలక్షన్స్ లో ఏ బాధ్యత ఇచ్చిన బాధ్యత గా పని చేస్తానన్నారు.13 ఏళ్ల తమ రాజకీయ ప్రస్థానం లో చిన్న స్థాయి నుంచి అంచె లంచెలుగా ఎదిగి నేడు ఎమ్మెల్యే స్ధాయి లో ఉన్నానని ఆయన తెలిపారు.