ఎమ్మెల్యే గంటా చే కళాకారుల క్రికెట్ టోర్నీ ట్రోఫీ ఆవిష్కరణ..

న్యూస్4అజ్: విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో జరగనున్న కళాకారుల క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీ నీ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారు గురువారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ టాలెంట్ తో ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచే కళాకారులకు ఇటువంటి టోర్నీలు ఆటవిడుపుగా ఉంటాయని, అలాగే కళాకారులకు క్రీడలు మంచి దేహ దారుఢ్యాన్ని ఆరోగ్యాన్ని కలిగిస్తాయని శ్రీ గంటా శ్రీనివాసరావు గారు అన్నారు.
వచ్చే నెల 20 21 22 తేదీలలో నగరంలోని పోలీసు మైదానంలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. మొత్తం 11 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు . హైదరాబాద్ కు చెందిన కళాకారుల జట్టుతో తోపాటు విశాఖకు చెందిన ఈవెంట్ మేనేజర్లు, సింగర్స్, డెకరేషన్ , సౌండ్ అండ్ లైటింగ్, కళాకారులు తో పాటు జర్నలిస్టులు కూడా ఒక్కొక్క టీమ్ గా ఏర్పడి ఈ టోర్నీలో పాల్గొంటాయని చెప్పారు. రోజుకు నాలుగు మ్యాచ్ లు ఉంటాయని , ఒక్కో జట్టు 10 నిర్ణీత ఓవర్లలో మ్యాచ్ ఆడతాయని చెప్పారు .. ట్రోఫీలు తో పాటు విజేతలకు పాతిక వేలు, 10, 000, 5000 రూపాయల ప్రైజ్ మనీ కూడా ఉంటుందని టోర్నీ నిర్వహకులు కే . జనార్ధన్ తెలిపారు. ఈ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు కె. రమణ రావు తో పాటు సహాయ కార్యదర్శి ఎం .శివ జ్యోతి, ధనంజయ్ సింగర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *