ఎమ్మెల్యే వాసుపల్లి చే కళాకారుల క్రికెట్ టోర్నీ పోస్టర్ ఆవిష్కరణ..

న్యూస్4అజ్: విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో జరగనున్న కళాకారుల క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారులకు ఇటువంటి టోర్నీలు క్రీడలు మంచి దేహ దారుఢ్యాన్ని ఆరోగ్యాన్ని కలిగిస్తాయని అన్నారు.వచ్చే నెల 20 21 22 తేదీలలో నగరంలోని పోలీసు మైదానంలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. మొత్తం 11 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు . హైదరాబాద్ కు చెందిన కళాకారుల జట్టుతో తోపాటు విశాఖకు చెందిన ఈవెంట్ మేనేజర్లు, సింగర్స్, డెకరేషన్ , సౌండ్ అండ్ లైటింగ్, కళాకారులు తో పాటు జర్నలిస్టులు కూడా ఒక్కొక్క టీమ్ గా ఏర్పడి ఈ టోర్నీలో పాల్గొంటాయని చెప్పారు. రోజుకు నాలుగు మ్యాచ్ లు ఉంటాయని , ఒక్కో జట్టు 10 నిర్ణీత ఓవర్లలో మ్యాచ్ ఆడతాయని చెప్పారు .. ట్రోఫీలు తో పాటు విజేతలకు పాతిక వేలు, 10, 000, 5000 రూపాయల ప్రైజ్ మనీ కూడా ఉంటుందని టోర్నీ నిర్వహకులు కే . జనార్ధన్ తెలిపారు. ఈ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు కె. రమణ రావు తో పాటు సహాయ కార్యదర్శి ఎం .శివ జ్యోతి, ధనంజయ్ సింగర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *