news4,news4us,pm modi,modi,india,new education system,good news,

బడి పిల్లలకు శుభ వార్త చెప్పిన ప్రధాని మోదీ

న్యూస్ 4 అజ్ : న్యూఢిల్లీ : విస్తృతమైన అధ్యయనం తర్వాతే కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ విద్యా విధానంపై ఆరోగ్యకరమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిలషించారు. ఎంత ఎక్కువ చర్చ జరిగితే అంత ప్రయోజనమని అన్నారు. నూతన విద్యా విధానంపై శుక్రవారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.కొత్త విద్యా విధానంతో పిల్లలపై పుస్తకాల భారం తగ్గుతుందని, విద్య నేర్చుకోవాలన్న కోరిక బాగా పెరుగుతుందని ప్రకటించారు.30 ఏళ్ల తర్వాత కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చామని, దీంతో దేశానికి విస్తృత ప్రయోజనాలు చేకూర్చుతాయని తెలిపారు. చిన్నారులు, యువతలో సృజనాత్మకత పెంచేలా ఈ విద్యా విధానం ఉందని, పిల్లల్లో నిశిత పరిశీలన, ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించేలా ఉందని ఆయన ప్రకటించారు. పిల్లలు తమ లక్ష్యం చేరుకునేందుకు ఈ విద్యా విధానం ఎంతో ఉపకరిస్తుందని, నర్సరీ నుంచి పీజీ వరకు విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చామని అన్నారు.ఒకే దేశం – ఒకే విద్యా విధానం ఉండాలని, రాష్ట్రాలన్నీ కొత్త జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 21 వ శతాబ్దంలో విద్యార్థులు నైపుణ్యాలపై ఈ విధానం దృష్టి పెడుతుందని, కొత్త ఆవిష్కరణల దిశగా యువత ఆలోచనలు సాగాలని ఆయన ఆకాంక్షించారు. కొత్త విద్యా విధానంపై ఎవ్వరికీ అపోహలుండాల్సిన అవసరం లేదని, భవిష్యత్ లక్ష్యాలకు విద్యార్థులను సిద్ధం చేయడమే ఈ విధానం లక్ష్యమని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *