5 లక్షల సొర చేపలతో కోవిడ్-19 వ్యాక్సిన్

న్యూస్4అజ్: కరోనాకి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది. ఈ మాయదారి రోగం ఎప్పుడు భూమిని వదిలేసి పోతుంది. అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. అయితే జంతు ప్రేమికులు, పర్యావరణ పరి రక్షకులు మాత్రం. వ్యాక్సిన్ తయారీలో ఉన్న భిన్నకోణాన్ని వెలికి తీసి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి మనిషికీ కోవిడ్ వ్యాక్సిన్ అందాలంటే. ఐదు లక్షల సొర చేపల ప్రాణాలు తీయాల్సి ఉంటుంది. ఈ విషయం వెల్లడయ్యాక నెటిజన్ల నుండి కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. కాలిఫోర్నియాలోని షార్క్ ఎల్లీస్ సంస్థ చెబుతున్న వివరాలను బట్టి. షార్క్ చేపల లివర్ నూనెలోంచి వచ్చే స్క్వాలెన్. అనే పదార్థం వ్యాక్సిన్ తయారీలో సహజ సమ్మేళనంగా ఉపయోగపడుతుంది. ఇది వైరస్ కి వ్యతిరేకంగా పనిచేసే రోగనిరోధక వ్యవస్థ పనితీరుని మరింతగా మెరుగుపరుస్తుంది.

యూరో న్యూస్ వెల్లడిస్తున్నదాన్ని బట్టి. ఒక్క టన్ను స్క్వాలెన్ కావాలంటే 2,500 నుండి 3000 వేల వరకు సొర చేపలను చంపాల్సి ఉంటుంది. అలాంటిది ప్రపంచ జనాభా అంతటికీ వ్యాక్సిన్ అందించాలంటే ఐదు లక్షల షార్క్ ల ప్రాణాలు తీయాలి. ఈ వివరాలు బయటకు వచ్చాక. ఇంటర్ నెట్ లో దీనిని వ్యతిరేకిస్తున్నవారు పెరుగుతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో సొరచేపలను వాడటం మానేసి పర్యావరణానికి హాని చేయని ఇతర మార్గాలను ఎంచుకోండి. అనే నినాదంతో పిటీషన్ వెబ్ సైట్ ఛేంజ్ డాట్ ఓఆర్ జిలో 44వేలమంది తమ ఫిర్యాదులను నమోదు చేశారు.

అయితే ఇప్పుడు వ్యాక్సిన్ కోసమనే కాదు. సౌందర్య సాధనాలు, యంత్రాల నూనెలు, ఇంకా ఇతర ఉత్పత్తులకోసం ఇప్పటికే ఏటా 30 లక్షల సొరచేపలను చంపుతున్నారు. ఈ పరిస్థితుల్లో సొరచేపల జాతి అంతమై పోతుందని, దాంతో సముద్ర పర్యావరణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని జంతు సంరక్షకులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *