మల్టీ స్టార్ ప్లాన్స్… హిట్టు కొట్టడం కాయం…

న్యూస్4అజ్: అరిమ నంబి అనే తమిళ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు కోలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ శంకర్. ఈ దర్శకుడు 2016లో చియాన్ విక్రమ్ తో కలిసి తీసిన ఇంకొక్కడు మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత 2018లో విజయ్ దేవర కొండతో నోటా చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం కూడా బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో డైరెక్టర్ ఆనంద్ శంకర్ కెరీర్ కు బ్రేక్ పడ్డట్టేనని అంతా అనుకున్నారు. కానీ ఈ దర్శకుడు మాత్రం ఎలాగైనా హిట్టు కొట్టాలని ఫిక్సయ్యాడు. తాజాగా ఓ మల్టీస్టార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళ ఫాలోవర్లున్న హీరోలు విశాల్‌-ఆర్యతో మల్టీస్టారర్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్‌.

విశాల్ హీరోగా నటించనుండగా ఆర్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. గద్దలకొండ గణేశ్ మృణాళిని రవి హీరోయిన్ గా నటించనున్నట్టు ఇన్‌సైడ్ టాక్‌.

విశాల్ ఇప్పటికే వరుస సినిమాలతో స్పీడు మీదున్నాడు. మరోవైపు ఆర్యకు మాత్రం కొంతకాలంగా సరైన సక్సెస్ లు రాలేదు. తాజా మల్టీ స్టారర్ తో ఆనంద్ శంకర్, విశాల్‌, ఆర్యకు మంచి రోజులొస్తాయని అంతా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *