ఇప్పుడు హైదరాబాద్ లో బెటర్ వే ఇదే…

న్యూస్4అజ్:   వానలు వారం నుంచి వానలే. పది రోజుల నుంచీ వానలే. ఆఫీసులకి పొయ్యేటప్పుడు వచ్చేటప్పుడు నానా తిప్పలు పడక తప్పడం లేదు. ట్రాఫిక్ లో కష్టాలు.. మ్యాన్ హోల్ భయాలు. కార్లైతే కొంతలో కొంత నయమే గానీ.. బండ్లపై వెళ్లే వారికి మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఇక రెండు రోజులుగా చూస్తున్నాం కదా. వరదలొచ్చి కొట్టుకుపోతున్నయ్ బండ్లు. కార్లు కూడా కాగితపు పడవల్లా లేచి పోతున్నయ్. అందుకే.. అందరూ మెట్రో మెట్రో అంటున్నారు.ఈ దిక్కు మాలిన కరోనా వచ్చిన తర్వాత.. మెట్రో అంటే భయపడుతున్నారు జనాలు. బస్సులు కూడా భయమే. ఏసీ ఉండడంతో మెట్రో అంటే టెన్షన్ గా ఉన్నారు. ఎక్కేవాళ్ల సంఖ్య భారీగా తగ్గింది కూడా.కానీ.. ఈ వానల టైంలో మాత్రం మెట్రోనే బెటర్. ఎంత వరదొచ్చినా దానికి ఏమీ కాదు. మరీ పట్టాలు కనపడనంత వానైతేనే తప్ప..

ఏగోలా ఉండదు. మెట్రో స్టేషన్ లో వెయిట్ చేయాలన్నా కూడా ప్రశాంతం. బస్టాపుల్లో వెయిట్ చేయాలన్నా ప్లేస్ ఉండదు. ఇద్దరు ముగ్గురు తప్ప..

ఎక్కువమంది నుంచోడం వీలు కాదు. వాళ్లు కూడా వానొస్తే తడవాల్సిందే. వేరే దిక్కు లేదు.అందుకే రోడ్లపై వెళ్లే వాళ్లు కూడా మెట్రో స్టేషన్ ల కింద వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు అదే మెట్రోకి డిమాండ్ వచ్చింది.

ఆఫీస్ కి రావాల్సిందే, డ్యూటీకి రావాల్సిందే అని పీకమీద కత్తి పెట్టి పిలిచే బాస్ లు ఉంటారు కదా. వాళ్లకి సబార్డినేట్ లు గా పనిచేసే వారికి ఒక్కటే దిక్కు మెట్రో. ఇంటి దగ్గర్నుంచి ఎలాగోలా కష్టపడి మెట్రో దగ్గరికి వస్తే.. మెట్రోలో ఎక్కి ఆఫీస్ కి దగ్గర దాకా ప్రశాంతంగా వెళ్లొచ్చు.
అక్కడి నుంచి నడిచో, ఉరుక్కుంటనో ఆఫీస్ కి వెళ్లొచ్చు అని ఆలోచిస్తున్నారు. మెయిన్ గా బండ్లపై వెళ్లే వాళ్లకి మాత్రం మెట్రో బెస్ట్ ఆప్షన్.ఇంటి దగ్గర బండి మధ్యలో మెట్రో.. ఆఫీస్ దగ్గర దిగిన తర్వాత మళ్లీ ఆటో అంటే మామూలు వాళ్లకి కష్టమే. జీతం కాస్త బెటర్ గా ఉండి.. ఈఎమ్ఐలు తక్కువగా ఉన్నవారికి మాత్రం మంచి ఆప్షన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *