జగన్ సర్కార్ కు చుక్కెదురు..దిశా బిల్లు వెనక్కి..

న్యూస్4అజ్: జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దిశ చట్టాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రోజురోజుకు ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనల నేపథ్యంలో… ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారికి కేవలం తక్కువ రోజుల వ్యవధిలోనే శిక్షలు పడేలా ప్రతిపాదనలు చేస్తూ దిశా బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదముద్ర వేయించింది. అయితే హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు వ్యక్తులు అతి దారుణంగా అత్యాచారం చేసి అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనలో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

ఇక ఈ ఘటన తర్వాత ఆడపిల్లలపై అత్యాచారం జరిగితే రోజుల వ్యవధిలోనే శిక్ష పడే విధంగా సరి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్రెడ్డి సర్కార్.ఇక జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీసుకువచ్చిన దిశ బిల్లు పై ఎన్నో ప్రశంసలు కూడా దొరికాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసనమండలిలో ఆమోదముద్ర పొందిన దిశా బిల్లు ఇక కేంద్రం ముందుకు వెళ్లిన విషయం తెలిసిందే. కానీ పార్లమెంటులో మాత్రం బిల్లుకు చుక్కెదురు అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశా బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపింది.

దీంతో ఏపీ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. దిశా బిల్లులో పలు లోపాలు ఉన్నాయి అంటూ కేంద్రం ఆరోపించింది. ఏపీ ప్రభుత్వం కేంద్రం ముందు ఉంచిన దిశా బిల్లులో పలు రకాల లోపాలు అభ్యంతరాలు ఉన్నాయి అంటూ తెలిపిన కేంద్ర ప్రభుత్వం వాటిని సవరించాలని అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించింది. దీంతో కేంద్రం సూచించిన పలు సవరణలతో సరికొత్త ముసాయిదా బిల్లు తయారు చేసి.. ఆ బిల్లును ఏపీ ప్రభుత్వం మరోసారి అసెంబ్లీలో శాసన మండలిలో ఆమోద ముద్ర వేయించుకోవాల్సి ఉంటుంది. కాగా మహిళలపై దాడులు అత్యాచారాలకు పాల్పడేవారికి కేవలం 21 రోజుల వ్యవధిలోనే శిక్ష పడే విధంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దిశ బిల్లును తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *