తెలుగు రాష్ట్రాల్లో తెరచుకున్నది ఒక్క థియేటరే…

న్యూస్4అజ్: 

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15 నుండి థియేటర్లు తెరచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు తెరచుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. మరో తెలుగు రాష్ట్రం ఏపీ అనుమతి ఇచ్చింది. మరి, అక్కడ థియేటర్లను తెరిచారా? అంటే ‘లేదు’ అని సమాధానం చెప్పాలి. అవును… అదే నిజం!

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటంటే ఒక్క థియేటర్ మినహా మిగతా థియేటర్లు ఏవీ తెరుచుకోలేదు. విశాఖపట్టణంలోని ఒక మల్టీప్లెక్స్ ను ఓపెన్ చేశారంతే! అయితే, ప్రేక్షకుల స్పందన అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని రాష్ట్రాలలో పాత సినిమాలను మళ్ళీ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

విడుదల చేస్తున్నారు కూడా! పోనీ ఆ విధంగా ఏపీలో పాత సినిమాలను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి.

థియేటర్లు మూసినా, తెరిచినా… కరెంట్ వాడినా, లేకపోయినా… మినిమమ్ బిల్ కట్టాలి. దాన్ని మాఫీ చేయమని థియేటర్ ఓనర్లు అడుగుతున్నారు. ఆ బిల్లులు రద్దు చేసిన తర్వాత థియేటర్లు తెరిచే అవకాశాన్ని పరిశీలిస్తామని ఏపీలో ఎగ్జిబిటర్లు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *