మోడీ చేసిందే జగన్ కూడా చేయాలి.. తేదేపా

న్యూస్4అజ్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్న ఆస్తులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రుల ఆస్తుల మీద కూడా ఒక ప్రకటన చేసింది. గత ఏడాది కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు ఈ ఏడాది కాస్త పెరిగాయి. కేంద్ర మంత్రి అమిత్ షా ఆస్తి గత ఏడాది కంటే ఈ ఏడాది కాస్త తగ్గింది. దీనిపై ట్విట్టర్ లో టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

“ప్రధాని మోదీ నిన్న తన ఆస్తులు ప్రకటించారు. చంద్రబాబు గారు గత ఏడేళ్ల నుంచి కుటుంబ సభ్యులతో సహా ఆస్తుల వివరాలు ప్రకటిస్తున్నారు. జగన్ రెడ్డి ఎందుకు ప్రకటించడం లేదు? ప్రకటిస్తే ఇన్ని వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రజలు అడుగుతారని భయమా?” అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *