షాకింగ్…కరోనా కొత్త లక్షణం…

న్యూస్4అజ్: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది, అయితే ఈ కేసులు ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు, ఇప్పటికే భారత్ లో రోజుకి 60 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి, అయితే కొన్ని లక్షణాలు ప్రాధమికంగా కనిపిస్తే అది కరోనా సంకేతం అంటున్నారు, ముఖ్యంగా ఇటీవల మరికొన్ని లక్షణాలు కూడా ఇందులో చేర్చడం జరిగింది..

ఇదే సమయంలో కరోనా వైరస్ కొత్త లక్షణం మరొకటి బయటకు వచ్చింది.

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఇప్పటివరకు జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, కళ్లు ఎరుపుగా మారడం, పాదాలపై ఎర్రటి గుర్తులు, రుచి, వాసన కోల్పోలవడం వంటి లక్షణాలు బయటకు వచ్చాయి.

కొత్త లక్షణం ఏమిటి అంటే కరోనా వైరస్ సోకినవారి కళ్లల్లో రక్తం గడ్డకట్టడాన్ని వైద్యనిపుణులు గుర్తించారు. బిహార్లో ఇలాంటి కేసులు ఇటీవల ఎక్కువగా నమోదవడంతో ఆందోళన కలిగించింది, ఇలాంటి వారికి పాజిటీవ్ గా వచ్చింది, సో ఇలాంటి లక్షణం ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి అని జాగ్రత్త పడాలి అని అంటున్నారు అక్కడ వైద్యులు, అయితే కరోనా ప్రభావం కంటిపై కూడా చూపిస్తోంది అంటున్నారు, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిగా రెటీనాలో రక్తం గడ్డకట్టడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.. కండ్లలో దురద, మంట, నీరు కారడం, కండ్లలో తీవ్రమైన నొప్పి, నల్ల గుడ్డు ప్రాంతంలో వాపు వంటివి సాధారణం కంటే ఎక్కువ కాలం ఉన్నట్లయితే వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *