మళ్ళీ భారీ వానలు…జర భద్రం…

న్యూస్4అజ్: హైదరాబాద్‌: తూర్పు మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం ఉదయానికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. ఇది మంగళవారానికి మరింత బలపడే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు, ఒకట్రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.మంగళవారం నుంచి మూడు రోజులపాటు చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించారు. ఆదివారం అత్యధికంగా నిర్మల్‌ జిల్లా పెంబిలో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *