బీజేపీ ఎన్నికల స్టంట్..ప్రతీ ఒక్కరికీ ఉచిత కోవిడ్ వ్యాక్సిన్..

న్యూస్4అజ్: బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే..! ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తూ ఉన్నాయి. పలు అంశాలను ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి పలు పార్టీలు. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అందులో ఉన్న ఓ వాగ్దానం అందరినీ షాక్ కు గురిచేసింది. అదేమిటంటే ప్రతి ఒక్కరికీ ఉచితంగా కోవిద్ టీకా. ప్రపంచాన్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్న కరోనా మహమ్మారికి టీకా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి.. ఇలాంటి సమయంలో బీహార్ లో బీజేపీ ప్రభుత్వం తాము అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికీ ఉచితంగా కోవిద్ టీకా ఇస్తామనడం సంచలమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *