covid19,corona,corona virus,symptoms,news4,news4us,

కోవిడ్ పై తాజా అధ్యయనం వెల్లడి.. 6 రకాలుగా కోవిడ్ ఇన్ఫెక్షన్లు..

న్యూస్ 4 అజ్ : కరోనా వైరస్ ఒక్కొక్కరి పై ఒక్కోలా ప్రభావం చూపుతున్నది. యువకులు, వృద్ధులు, పసిపిల్లలు అనే తేడా లేకుండా అందరికీ సోకుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్నది ఈ మహమ్మారి.ఈ వైరస్ విషయంలో కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక పరిశోధనలు మొదలు పెట్టారు. లండన్‌లోని కింగ్స్ కళాశాల కు చెందిన పరిశోధకులు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఆరు రకాలుగా ఉన్నట్లు కనుగొన్నారు.

* జ్వరం లేకుండా ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్ తో బాధపడేవారిలో జలుబు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, చాతినొప్పి, కండరాల నొప్పి, వాసన కోల్పోవడం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయట. ఈ సంక్రమణ దశలో మాత్రం జ్వరం ఉండదంటున్నారు.
* జ్వరంతో కూడిన ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్ వచ్చిన రోగులు తేలికపాటి ఫ్లూ లక్షణాలు కలిగి ఉంటారట. అలాగే జ్వరం కూడా ఉంటుంది. కానీ, ఆకలి తగ్గడం, పొడి దగ్గు, గొంతు మొద్దుబారడం వంటివి లక్షణాలు కనిపిస్తాయట.
* జీర్ణశయాంతర సంక్రమణ అనే క్లస్టర్‌కు చెందిన రోగుల్లో వారి జీర్ణక్రియ సరిగ్గా పనిచేయదట. అంతే కాకుండా దగ్గు, వికారం, ఆకలి లేకపోవడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలను ఎక్కువగా ఉంటాయని, తలనొప్పితో పాటుగా, స్వల్పంగా ఛాతీ నొప్పి ఉంటుందట.
* తీవ్ర ఇన్ఫెక్షన్, నీరసం వంటి వాటివి బాధిస్తాయట. అలాగే వీరికి రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల ఈ అలసట కలుగుతుంది. ఇక కరోనా లక్షణాలు ఉన్నాయని అనడానికి ఇదొక హెచ్చరిక లాంటిది. అలసట, తలనొప్పి, వాసన, రుచి కోల్పోవడం, గొంతు నొప్పి, జ్వరం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలతో ఈ రోగులు బాధపడతారు.
* ఈ దశకు చేరుకున్న కరోనా రోగికి ఇవి అత్యంత ముఖ్యమైన రోజులు. కరోనా వైరస్ పూర్తిగా లంగ్స్‌లోకి చేరిపోయి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడమే కాకుండ, గొంతు నొప్పి, దీర్ఘకాలిక జ్వరం, ఆకలి లేకపోవడం, తలనొప్పి, విరేచనాలు, శ్వాశకోశ సమస్యలు, కండరాలు, కడుపు నొప్పి వంటి బాధలు కలిగిస్తాయి. ఈ క్లస్టర్‌కు చెందిన వ్యక్తులు త్వరగా ఆసుపత్రిలో చేరగా ఒక్కోసారి వెంటిలేషన్, ఆక్సిజన్ కూడా ఖచ్చితంగా అందించవలసి ఉంటుందట.
* ఈ దశలో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తోపాటు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే విధంగా ఈ కోవిడ్ లక్షణాలు ఉంటాయి. అదీగాక తలనొప్పి, వాసన కోల్పోవడం, ఆకలి లేకపోవడం, దగ్గు, జ్వరం, గొంతు మొద్దుబారడం, మనసు స్థిమితంగా ఉండలేకపోవడం, ఛాతీ నొప్పి, అలసట, కండరాల నొప్పి వంటి లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయట. ఇలా కరోనా పాజిటివ్ వచ్చిన మొదటి వారంలో ఉన్న లక్షణాల ద్వారా ఆ వ్యక్తిలో ఈ వైరస్ తీవ్రత ఎంత ఉంటుందో తెలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

2 thoughts on “కోవిడ్ పై తాజా అధ్యయనం వెల్లడి.. 6 రకాలుగా కోవిడ్ ఇన్ఫెక్షన్లు..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *