న్యూస్4అజ్: భారతదేశం రాజకీయ చరిత్రలో గర్వించదగ్గ నాయకురాలు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీని కొనియాడారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ 36వ వర్ధంతి సందర్భంగా శనివారం ఉదయం జైల్ రోడ్డు వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధాని మరియు రెండుసార్లు ప్రధానమంత్రిగా చేశారని మరియు కాంగ్రెస్ పార్టీలో లో ఎన్ని ఉన్నతమైన పదవులు చేశారని, దేశ రాజకీయ చరిత్రలో నిరంకుశ పాలన దేశాన్ని నడిపించగల చరిష్మా గల నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ తన పదవీ కాలంలో బ్యాంకుల జాతీయకరణ మరియు బడుగు బలహీన వర్గాల వారికి ఎంతమందికి ఉపయోగపడే విధంగా పరిపాలన సాగించారని దేశంలో పేదల కోసం గరీబీ హటావో పథకాన్ని మరియు 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు 1974 లో అణుశక్తి పరీక్షలు జరిపి దేశాన్ని ప్రపంచంలో అను శక్తి సామర్థ్యం గల దేశంగా ఆమె తెలిపారు ఇంద్ర గాంధీ రాజీవ్ గాంధీ మరణానంతరం ఈరోజు వరకు అటువంటి పాలన అందించే ప్రధానమంత్రి ఎవరు లేరని గాంధీ కుటుంబ దేశానికి చేసిన సేవలకు దేశ రుణపడి ఉందని తెలియజేశారు కార్యక్రమంలో గొంప గోవింద్ ,సునందా, సుధాకర్, వెంకటరమణ, బమ్మిడి గంగాధర్, స్వర్ణ, ఉరుకుటు అచ్చిబాబు, పరదేశి, మండలి శ్రీనివాస్, వైయస్ జగన్, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు
