న్యూస్4అజ్: దేశంలోని సామాన్య పేద ప్రజల కష్టాలు ఏమాత్రం పట్టించుకోకుండా చేసిన అనాలోచిత నోట్ల రద్దు నిర్ణయంతో నేటికీ ప్రజలకు అవస్థలు పడుతున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పేడాడ రమణకుమారి.ఈ రోజు విశ్వాస్ ఘాత్ దివస్ పేరిట నోట్లరద్దుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమ చేపట్టినట్లు చెప్పారు.సోషల్ మీడియాలో స్పీక్ అప్ పేరిట నోట్లరద్దువలన కలిగిన నష్టాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.నాలుగేళ్లక్రితం ప్రధాని మోడీ తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని దుయ్యబట్టారు.అలాగే కరోనా కట్టడికి ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా,ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రకటించిన లాక్ డౌన్ వల్ల ఎంతోమంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు.లక్షలాదిమంది ఆకలితో అలమటించారని విమర్శించారు.ఎంతో ఘనంగా ప్రవేశపెట్టిన జీ ఎస్ టీ వల్ల చిన్న,మధ్య తరగతి వ్యాపారస్తులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది ఏంటి సమస్యలన్నీ ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఏఐసిసి ప్రతిపాదన మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు స్పీక్ అప్ ఎగైనెస్ట్ డిమానిటైజేషన్ అనే నినాదంతో నోట్ల మార్పిడి వల్ల వచ్చిన ఇబ్బందులు కరోనా సమయంలో ప్రజలను కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను తెలియజేస్తామని ఆమె ప్రకటనలో తెలియజేశారు
