పాపం ట్రంప్ హెలిపేడ్ అమ్మేస్తున్నారట..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ త్వరలోనే వైట్‌హౌస్‌ను వదిలిపెట్టి వెళ్లబోతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రాజభోగాలు అనుభవించిన డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో బైడెన్ గెలుపుతో ట్రంప్ ఇక ఓ సాధారణ వ్యక్తిగా మారబోతున్నారు. ఎలక్షన్ రిజల్ట్స్‌తో ట్రంప్ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. నిజానికి ట్రంప్ మొదటి నుంచి చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అమెరికా అధ్యక్షుడు కాకముందు కూడా అతడో పెద్దపారిశ్రామిక వేత్త. అందువల్ల చాలా రిచ్ లైఫ్ లీడ్ చేసేవారు. అతడి దగ్గర ఎన్నో ప్రైవేట్ జెట్స్ హెలికాప్టర్స్ ఉన్నాయి. ఇటీవలి ఎన్నికల సందర్భంగా ట్రంప్ బోయింగ్ 757 విమానాన్ని వినియోగించారు. అయితే ట్రంప్ ఇప్పుడు తన దగ్గర ఉన్న ఓ విలాసవంతమైన హెలికాప్టర్‌ను అమ్మకానికి పెట్టినట్టు సమాచారం.దాని ధర భారత కరెన్సీ ప్రకారం రూ. 24 కోట్లు ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి. ట్రంప్ ఈ హెలికాప్టర్లో కూర్చున్న పలు ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ హెలికాప్టర్‌ను ట్రంప్ ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. అందులో ఆయన కూర్చొనేందుకు ఓ ప్రత్యేకమైన అమరిక ఉంది. విలాసవంతమైన సీట్లు ఉన్నాయి. ఈ హెలిక్యాప్టర్ సుమారు 6259 గంటల ప్రయాణాన్ని పూర్తి చేసింది. ట్రంప్ ప్రత్యేక లోగో హెలికాప్టర్ తోకపై కూడా ఉంటుంది. ట్రంప్ పరిస్థితి చూసి అంతా అయ్యో పాపం అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *