రైతులను విస్మరించిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు..పేడాడ రమణకుమారి

న్యూస్4అజ్: విశాఖపట్నం: “కొర్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ కేంద్ర ప్రభుత్వం బలవంతంగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేఖంగా గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా రైతన్నలు వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నా బిల్లులను వెనక్కు తీసుకోకపోగా రైతులపై పోలీస్ ల తో దాడి చేయిస్తున్న తీరు అమానుషమని, రైతుల నిరసనలకు మద్దుతుగా రైతు-కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన భరత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, పార్టీలకతీతంగా ప్రజలు ఈ బందుకు తమ సంపూర్ణ మద్దతు నిచ్చి రైతులకు బాసటగా నిలువాలని”

“పంటచేతికొచ్చిన రైతన్నకు ప్రభుత్వాలు బాసటగా నిలవాలని, ధాన్యానికి తక్షణమే మద్దతుధరను పెంచి రైతు భరోసా కేంద్రాల్లోనే పంటను కొనాలని, తడిచిన వరిపొలాలను నమోదుచేసి వారికి నష్టపరిహారం చెల్లించాలని, రైతులను విస్మరించిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేదని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బిల్లులకు వ్యతిరేకంగా రైతు నిరసనలకు మద్దతు ప్రకటించాలని” ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి పేడాడ రమణి కుమారి డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *