ఐపీఎస్ శిఫ్రా శ్రీవాస్తవ్ కు ఇండియన్ పోలీస్ మెడల్ రాక తో వైరా ఎమ్మెల్యే ఇంట సంబరాలు

న్యూస్4అజ్:  సీనియర్ ఐపీఎస్ శిఫ్రా శ్రీవాస్తవ్ కు ఇండియన్ పోలీస్ మెడల్ అని ప్రకటనతో వైరా ఎమ్మెల్యే లవిడియా రాములు ఇంట సంబరాలు నెలకొన్నాయి.  అసలు ఇంతకీ ఆ సంతోషానికి కారణం ఏమిటంటే ఆమె స్వయానా ఎమ్మెల్యే రాములు గారి కోడలే.. ఇక కోడలిని కూడా కుతురులానే ప్రేమించే ఆయన ప్రేమకి అవధులు లేకపోయాయి. ఇంక స్వతహాగా పోలీసు అధికారి అయిన రాములునాయక్‌కు ఆ పతకం విలువ తెలుసు. అందుకే ఆయన అంతులేని ఆనందంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఆమె సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఐజీపీ క్యాడర్‌లో ముంబయ్‌లోని ఓఎన్‌జీసీ సీనియర్‌ పోలీస్‌ కమాండంట్‌గా పనిచేస్తున్నారు. రాములునాయక్‌ కుమారుడు జీవన్‌లాల్‌ సీనియర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి.ముంబై‌లోని ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అడిషనల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.తమ నాయకుడి కోడలు జాతీయ స్థాయి మెడల్‌కు ఎంపిక కావడంతో వైరాలో సంబరాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే అభిమానులు మరియు జీవన్‌లాల్‌కు ఇక్కడి ప్రాంత నగర వాసులతో సోదర స్నేహ సత్సంబంధాలు ఉండడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసు అధికారి అయిన ప్రతి ఒక్కరికి ఈ అవార్డు ఓ కల. అది నెరవేరితే పొందే ఆనందం వర్ణణాతీతం.
స్వతహాగా రైతు కుటుంబం అయిన రాములునాయక్‌ పోలీసు కానిస్టేబుల్‌గా జీవితం ప్రారంభించారు. 37 ఏళ్ల పాటు అనేక హోదాల్లో పనిచేసిన రాములునాయక్‌ ఎస్సైగా పదవీవిరమణ చేశారు.అనంతరం రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసి మొదటి సారే ఎమ్మెల్యేగా గెలుపొందారు.మొదటి నుంచి మంచి క్రీడాకారునిగా పేరున్న రాములునాయక్‌ అనేక కష్టాలతో స్వయం కృషితో ఎదిగారు.స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచిన రాములునాయక్‌ అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.వివాదరహితునిగా పేరున్న రాములునాయక్‌, తన కుటుంబానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *