శవానికి వైద్యం…ఠాగూర్ సినిమా రిపీట్…నెల్లూరు మెడికవర్ హాస్పటల్ సీన్

న్యూస్4అజ్: నెల్లూరు:

*💥ఠాగూర్ సినిమా తలపించేలా…*

*💥మెడికవర్ హాస్పిటల్ సీన్ రిపీట్…*

*💥శవానికి వైద్యం…లక్షల్లో బిల్లు వసూలుకు యత్నం*

💥 *నెల్లూరు మెడిక‌వ‌ర్‌ ఆసుపత్రి నిర్వాహకం*

*💥ఆందోళ‌న‌కు దిగిన బంధువులు, పోలీసుల రంగ ప్ర‌వేశం*

గిరిజ‌నుడి కిడ్నీలు అమ్ముకుని వివాదాలు మూట గ‌ట్టుకున్న సింహ‌పురి ఆస్ప‌త్రి ఇప్పుడు మెడిక‌వ‌ర్‌గా పేరు మార్చుకుని రోగుల ర‌క్తాన్ని తాగుతోంది. ఎవ‌రైనా అనారోగ్యంతో ఈ ఆస్ప‌త్రికి వ‌స్తే ల‌క్ష‌ల్లో కాజేస్తారు. వీరికి ఉన్న మ‌రో ప్ర‌త్యేక‌త ఏమిటంటే శ‌వాల‌కు సైతం వైద్యం చేసిన‌ట్లు న‌టించి ల‌క్ష‌ల్లో వ‌సూలు చేస్తారు. మెగాస్టార్ న‌టించిన ఠాగూర్ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది… ఆ సినిమాలో ఓ కార్పొరేట్ ఆస్ప‌త్రి శ‌వానికి వైద్యం చేసి ల‌క్ష‌ల్లో బిల్లు వ‌సూలు చేస్తుంది.*

*అదే సీన్‌ను నెల్లూరులో మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రి రిపీట్ చేసింది.మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రిలో చనిపోయిన ఓ మహిళకు వైద్యం చేస్తున్నాం అంటూ.. హడావిడి చేసి దాదాపు రెండున్నర లక్షలు వసూలు చేసింది. ఫీజులు చెల్లించాక చావు కబురు చల్లగా చెప్పారు. వివ‌రాలిలా ఉన్నాయి.* *నగరంలోని ఎన్టీయార్ నగర్ కి* *చెందిన భార్య భర్తలు భాష, సైదా ల మధ్య బుధ‌వారం ఉదయం కుటుంబ విషయంలో గొడవలు జరిగాయి.* *ఆసమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన భాష తన భార్య సైదాను* *కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు వెంటనే అక్కడికి సమీపంలోనే మెడికవర్ హాస్పిటల్ కు* *తరలించారు. భార్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో బాషా పురుగుమందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతనిని సమీపంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.*

*అప్పటికే కత్తిపోట్లకు గురై మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సైదా పరిస్థితి విషమంగా ఉండడతో ఆమె కుమారులు ఆందోళన చెందారు.సైదా పరిస్థితి విషమంగానే ఉంది.. ఐసియూలో చికిత్స చేస్తున్నాం.. ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు హాస్పిటల్ నిర్వాహకులు. దీంతో అడిగినంత మేర ఆమెకు కుటుంబ సభ్యులు ఫీజులుచెల్లించారు.ఒకవైపుతండ్రిమరణం …ఇంకో వైపు తల్లి* *విషమ పరిస్థితుల్లో ఉందని తెలిసి ఆందోళన చెందుతున్న వారు తమపరిస్థితినిమెడిక‌వ‌ర్‌ హాస్పిటల్ నిర్వాహకులకు వివరించారు.*

*ఆసమయంలోమానవత్వాన్ని* *చూపాల్సిన హాస్పిటల్ నిర్వాహకులు ధనదాహం ప్రదర్శించారు. పక్కాగా స్కెచ్ వేసి డబ్బులు వసూలు చేశారు.సైదా కి చికిత్స చేస్తున్నట్లు నమ్మించి రెండున్నర లక్షలు వసూలు చేశారు. ఐసీయూలో చికిత్స చేస్తున్నామని చెప్పి పదేపదే* *డ‌బ్బు గుంజ‌డంతో హాస్పిటల్ నిర్వాహకులపై సైదా కుటుంబ‌స‌భ్యుల‌కు అనుమానం వ‌చ్చింది. తాము పేషెంట్ ను ప్రత్యక్షంగా చూడాలని పట్టుబట్టారు.* *పరిస్థితిని గమనించిన మెడికల్* *హాస్పిటల్ నిర్వాహకులు* *మొదట ససేమిరా అన్నారు.* *కుటుంబ సభ్యులు ఎక్కువమంది అక్కడికి చేరి హాస్పిటల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపారు.*

*దీంతో పరిస్థితిని గమనించిన హాస్పిటల్ నిర్వాహకులు ఆమె చనిపోయినట్లు చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో బాధితులు అర్ధరాత్రి హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. ప‌రిస్థితి చేయిదాటి పోవ‌డంతో ఆస్ప‌త్రి నిర్వాహ‌కులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగ ప్ర‌వేశం చేయ‌డంతో ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు మృతురాలి బంధువుల‌కు, కుటుంబ‌స‌భ్యుల‌కు స‌ర్ధి చెప్పారు. ప్ర‌జ‌ల ర‌క్తం తాగుతున్న మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *