కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేవలం కార్పొరేట్లకు కొమ్ము కాసే బడ్జెట్టే…పేడాడ రమణికుమారి

న్యూస్4అజ్:  కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం కార్పొరేట్లకు మాత్రమే ఉపయోగపడేలా ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఒక ప్రకటనలో అన్నారు.
కరోనా తో సామాన్యుల బ్రతుకే ప్రశ్నర్ధకంగా మారిన వేళ ప్రభుత్వం సామాన్యులకు ఉపయోగపడేలా బడ్జెట్ ఉంటుందని ఆశించామన్నారు.కానీ బీజేపీ ప్రభుత్వం సామాన్యులను,రైతులను మరింత కృంగదీసే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని దుయ్యబట్టారు. చిన్నపరిశ్రమలకు కూడా ఏ విధమైన రాయితీలు లేవన్నారు.కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్ గా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ను పూర్తిగా విస్మరించారన్నారు. పేదోళ్ల కడుపుకొట్టి ఉన్నోళ్లకు దారబోసేవిధంగా బడ్జెట్ రూపొందించారని రమణికుమారి ఎద్దేవ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *