న్యూస్4అజ్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రాజకీయం రంజుగా మారింది. జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుకునేందుకు స్వయంగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగారు. ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఆదివారం సాయంత్రం శాంతిపురంలోని కళ్యాణ మండపంలో వైసీపీ శ్రేణులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతర్గత సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలపై చర్చించారు. ప్రతి పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులు ఒక్కరే నిలబడాలని ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులకు మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. పార్టీ రెబల్ అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడకుండా ప్రతి పంచాయతీలో ఒక అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. వీలైతే సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవలకు ప్రయత్నించాలని వైసీపీ శ్రేణులకు మంత్రి పెద్దిరెడ్డి దిశానిర్దేశం చేశారు.
