మ‌రో తొమ్మిది మంది వాలంటీర్ల‌పై వేటు..

న్యూస్4అజ్: నెల్లూరు కార్పొరేష‌న్‌లో వాలంటీర్ల‌పై వేటు ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఇటీవ‌ల ఇద్ద‌రు వాలంటీర్ల‌ను తొల‌గిస్తూ కార్పొరేష‌న్ అద‌న‌పు డిఫ్యూటీ క‌మిష‌న‌ర్ ప్ర‌సాద‌రావు ఉత్త‌ర్వులు జారీ చేశారు. అయితే వాలంటీర్ల తొల‌గింపు అన్యాయ‌మ‌ని ఇటీవ‌ల న‌గ‌రంలోని వాలంటీర్లు కార్పొరేష‌న్ కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా నిర్వ‌హించారు. అనంత‌రం ఇద్ద‌రు వాలంటీర్ల తొల‌గింపుపై పునఃప‌రిశీల‌న చేయాల‌ని ఎడిసిని కోరారు. అయితే ఎడిసి వాలంటీర్ల వ్య‌వ‌హారంపై లోతుగా విచార‌ణ నిర్వ‌హించ‌గా మ‌రో తొమ్మిది మంది వాలంటీర్లు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు వ్య‌తిరేకంగా పోస్టింగులు పెడుతున్నార‌ని తేలింది. దాంతో తొమ్మిదిమందిని తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. తొల‌గించిన వారి నుంచి వెంటనే సెల్ ఫోన్ థంబ్ మిషన్ స్వాధీనం చేసుకుని లాగిన్ ను బ్లాక్ చేయాలని నగర కార్పొరేషన్ అధికారులు అడ్మిన్ల‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు. న‌గ‌రంలో మొత్తం 11మంది వాలంటీర్ల‌ను తొల‌గించిన‌ట్లు తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *