తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా◆వైఎస్ షర్మిల కొత్త పార్టీ◆

న్యూస్4అజ్: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు వైఎస్ షర్మిల పావులు కదుపుతోంది. ఈరోజు హైదరాబాద్ లోని తన నివాసం వద్ద వైఎస్ఆర్ అభిమానలు, ఆత్మీయుతలో జరిపిన సమావేశంలో ఈ విషయం స్పష్టమైంది. తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తెస్తానని ఆమె ప్రకటించింది. తెలంగాణలో కూడా పాదయాత్ర చేసి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేస్తానని అన్ని జిల్లాల నాయకులతో సమావేశమై తన కార్యాచరణ రూపొందిస్తానని చెప్పింది. కొత్త పార్టీ పెట్టబోతున్న విషయాన్ని కూడా సూచన ప్రాయంగా ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *