maheshbabu latest,news4,news4us,tollywood,maheshbabu

టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ల జోరు తో మహేష్ బాబు కూడా…

న్యూస్ 4 అజ్:టాలీవుడ్ :కరోనా వైరస్ వ్యాప్తి వలన సినీ ఇండస్ట్రీ దాదాపు స్తంభించిపోయింది. చాలా వరకూ సినిమాలు నిలిచిపోయాయి. లాక్ డౌన్ తర్వాత సినిమా షూటింగ్స్ కు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ఆగిపోయిన, మొదలు కావలిసిన సినిమాలు నెమ్మదిగా షూటింగ్ పనులు మొదలుపెడుతున్నాయి. వీటితో పాటు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ లు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో తమిళ హీరో సూర్య నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో ఓ తమిళ దర్శకుడితో సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. విజయ్ హీరోగా ‘మాస్టర్’ చిత్రాన్ని రూపొందించిన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మహేశ్ నటించవచ్చని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మహేశ్ బాబు ముందు ఇప్పుడు భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. తమిళ దర్శకుడితో సినిమా కంటే ముందు మహేశ్ దర్శకుడు రాజమౌళి తో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపించాయి. ఇప్పుడు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి చేసి మళ్ళీ మహేశ్ తో సినిమా పట్టాలెక్కించడానికి చాలా సమయం పడుతుంది. ఈ గాప్ లో తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ మహేశ్ తో ఓ సినిమా తీసేయాలని చూస్తున్నారట. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మహేశ్ తో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుందని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం మహేశ్ పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర బృందం. మళ్ళీ ఈ నెలలో మహేశ్ పుట్టినరోజు రోజు సందర్భంగా సినిమాలో ఓ పాటను విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *